ఇరుసుమండ బ్లోఔట్ మూసివేత ఎంపీ హరీష్ బాలయోగి

పయనించే సూర్యుడు జనవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి అతి తక్కువ సమయంలోనే బ్లోఔట్ మూసివేతకు కృషి చేసిన ఎంపీ హరీష్ బాలయోగికి పలువురు అభినందనలు గత వారం రోజుల నుండి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేసిన మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని బ్లోఔట్ మూసివేయడం జరిగిందని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు. గత వారం రోజుల నుండి భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులకు ఇది శుభవార్తగా భావిస్తున్నానన్నారు. ఈ ఘటనపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, సీఎంఓ కు ధన్యవాదాలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే బ్లోఔట్ ను మూసివేసిన ఓఎన్జీసీ నిపుణుల బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సమన్వయంతో పాటుపడిన జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎంపీ హరీష్ అభినందించారు. ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ తో నడిచే బుల్లెట్ ట్రైన్ స్పీడ్ సర్కార్ అని మరోసారి రుజువయ్యిందన్నారు. జిల్లా వాసులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేస్తున్నట్లు ఎంపీ హరీష్ తెలిపారు. అతి తక్కువ సమయంలోనే ఈ బ్లోఔట్ మూసివేతకు రాత్రనకా పగలనకా కృషి చేసి గ్రామస్తులకు అండగా నిలిచిన ఎంపీ హరీష్ బాలయోగిని పలువురు అభినందించారు.