పయనించే సూర్యుడు జనవరి 11 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కి వినతి పత్రం అంద చేసినట్టు ఉద్యమకారుల జనగామజిల్లా అధ్యక్షులు గుగులోతు రాముల నాయక్ తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన ఉద్యమకారులను గుర్తించి వారికోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కి శనివారం క్యాంపు కార్యాలయంలో సన్మానించిన అనంతరం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటామని హామీలతో కూడిన మ్యానిఫెస్టో విడుదల చేసిందని అనంతరం ఎన్నికలలో గెలుపొంది ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పింఛను సదుపాయం హామీల కోసం కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలలో, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో తెలంగాణ ఉద్యమకారులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడవెల్లి దండయ్య, ఐరోండ్ల మార్కెండేయ,అనుముల అంజిరావు, వంగాల తిరుపతి రెడ్డి, గాదెపాక యాకయ్య, ఎడవెల్లి కొంరుమల్లు, సింగ మహేందర్ రాజు, గూడూరు లెనిన్, గాదెపాక మాహిందర్, పులి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.