
పయనించే సూర్యుడు జనవరి 11 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఎమ్మిగనూరు నుండి గూడూరుకి వెళ్లే గుంతలు గుంతలు పడ్డ రహదారిని డబల్ రోడ్డు వేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆఫ్రిద్ రఘునాథ్ కృష్ణ ఖాజా ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుండి గూడూరు వైపు కర్నూలుకు వెళ్లేటటువంటి రహదారి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందని రోడ్డు వేసి దాదాపుగా నాలుగేళ్లు పైగానే గడవడం జరుగుతుంది అన్ని అప్పటినుండి ఇప్పటివరకు అడపాదడపా మరమ్మత్తులు వేస్తూ కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఆ రోడ్డుకి కేటాయించినటువంటి నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందని వారు వేసినటువంటి ప్యాచీలు కనీసం రెండు లేదా మూడు నెలల లోపే భారీగా గుంతలు పడడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిసర ప్రాంత గ్రామాలు ప్రజలు ప్రమాదాలతో అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మిగనూరు పట్టణానికి చేరాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదే కాకుండా రోడ్లు గుంటలు గుంటలుగా పడడం వలన ఉదయం 7 8 గంటలకు రావాల్సినటువంటి బస్సులు కూడా 10 11 గంటలకు రావడం వలన విద్యార్థులకు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని వారు అన్నారు కావున అధికారులు దీనిపైన స్పందించి టూ డబుల్ రోడ్డుగా వేసే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటా మని వారు హెచ్చరించారు.