ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆటో యూనియన్ నాయకుల సంపూర్ణ మద్దతు

* ఎంసిసి కార్మికుల నిరాహార దీక్ష 6 వ రోజుకు చేరింది

పయనించే సూర్యుడు జనవరి 11 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) మంచిర్యాల్ ఆటో యూనియన్ నాయకులు ఎంసిసి కార్మికులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది మరియు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఈరోజు స్థానిక ఎంసిసి ప్రాంతంలో ఎంసిసి కార్మికులు చేస్తున్న నిరోధిక సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కార్మికులకు న్యాయం జరిగేంతవరకు కార్మికులకు అండగా, ఉంటానని తెలిపారు మీరు చేస్తున్న నిరాహార దీక్షకు మరియు భవిష్యత్తులో చేయబోయే న్యాయ పోరాటానికి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మీతో పాటు ముందుండి నడిపిస్తుందని మంచిర్యాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున మేము హామీ ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేశ్వర్మ మరియు జిల్లా నాయకులు పుట్ట లావణ్య వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి చిరంజీవి కార్యదర్శి పాకాల దినకర్ యువజన విభాగం అధ్యక్షులు దాస్యపు దీపక్ విద్యార్థి విభాగం అధ్యక్షులు సేపతి సాయికుమార్ సోషల్ మీడియా కన్వీనర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *