పయనించే సూర్యుడు జనవరి 11 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)పాలకుర్తి మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దేవరుప్పుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 94 మంది అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ. 94,10,904/- విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారుల చేతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పేద,బలహీన వర్గాల కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఈ పథకాలు మహిళల గౌరవాన్ని కాపాడుతూ, సమాజంలో సమానత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పూర్తి పారదర్శకతతో అమలు జరుగుతుందని, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సహాయం అందుతోందని, భవిష్యత్తులో కూడా పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా తన వంతు కృషి కొనసాగిస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల తహసీల్దార్ మహ్మద్ అశ్వక్ అహ్మద్, దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, దేవరుప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణ మూర్తి గౌడ్, దేవరుప్పుల మండల ప్రజా ప్రతినిధులు, దేవరుప్పుల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీనాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.