పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 బోధన్ : ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ మాతృమూర్తి ఇటీవల మరణించారు ఈ సందర్భంగా ప్రభుత్వ సలదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి శనివారం వారి నివాస మైనటువంటి ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, అరకెల నర్సారెడ్డి, గంగా శంకర్, శరత్ రెడ్డి, మోబిన్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.