కూనవరం గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం పై జరిపిన విచారణ తీసుకున్న చర్యలు పై శ్వేత పత్రం విడుదల చేయండి

పయనించే సూర్యడు ప్రతి నిధి సాగర్ జనవరి.11.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను డిమాండ్ కూనవరం మేజర్ గ్రామపంచాయతీ లో సర్పంచ్ మరియు గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి కలిసి దోచుకున్న ప్రజాధనంపై గతంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేసిన పోరాట ఫలితంగా విచారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది విచారణలో అవినీతి జరిగినట్లు తేలినప్పటికీ ఇప్పటివరకు సర్పంచ్ పై మరియు పంచాయతీ కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు విచారణ కమిటీ చేసిన విచారణ నిరూపితమైనటువంటి అక్రమాలపై అదేవిధంగా నిధులు దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ పై మరియు పంచాయతీ కార్యదర్శి పై ఎటువంటి చర్యలు తీసుకున్నారు తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు ప్రభుత్వం మరియు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ పారదర్శకంగా విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నామని ఇప్పటితో ఆ నమ్మకం పోయిందని విచారణ కమిటీపై సంబంధిత ఉన్నత అధికారులపై అక్రమాలకు పాల్పడిన గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిధులు దుర్వినియోగంపై దశలవారీగా ఉద్యమం ఉంటుందని ఈ విషయంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మొదటినుండి ఎలా ఉందో ఇప్పటికీ అదే స్టాండ్ లో ఉందని అక్రమాలకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసే హక్కు తప్పు చేసిన వారిని శిక్షించాలని ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉందని కేవలం పంచాయతీ ప్రజలే ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి చేసిన అవినీతి చిట్టా తమ వద్ద ఉందని అవినీతి జరిగిన సంగతి విచారణ కమిటీకి ఉన్నతాధికారులకు కూడా తెలుసని అయినప్పటికీ ఉద్దేశిపూర్వకంగానే అక్రమార్కులను కాపాడుతూ వస్తున్నారని దీనికి కారణం విచారణ కమిటీకి సంబంధిత అధికారులకు కమిషన్లు అందాయని అందుకే చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కుంజ శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి