కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని మోకాళ్లపై నిరసన

★ జిల్లా బీసీ నాయకులు అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ రాష్ట్ర బిసి నాయకులు గజేల్లి వెంకటయ్య

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలుచొని నిరసన వ్యక్తం చేస్తూ బీసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీల సామాజిక రక్షణ భద్రతకై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికిని కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల అట్రాసిటీ చట్టాన్ని తీసుకు వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసి బీసీల పక్షాన నిలబడాలని కోరుతున్నాం అని తెలుపుతూ బీసీలలో అనేక కులాలు కుల వివక్షకు గురైన కులాలు ఉన్నాయి సామాజిక భద్రత లేని కులాలు దేశంలో రాష్ట్రంలో అనేకంగా ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిసి ఆక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర బీసీ నాయకులు గజెల్లి వెంకటయ్య, షాకపూరి భీమ్సేన్, వేముల అశోక్, అంకం సతీష్, మాదరబోయిన నరసయ్య మరియు చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు