
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 యడ్లపాడు మండల ప్రతినిధి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపితం చేసే కార్యక్రమంలో భాగంగా, చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజిని నేతృత్వంలో ఎడ్లపాడు మండలంలోని కొండవీడు, కోట గ్రామాల్లో గ్రామస్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ, వైసీపీ బలం కార్యకర్తలేనని, గ్రామస్థాయి కమిటీలే పార్టీకి పునాది అని స్పష్టం చేశారు. జగనన్న పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు జరిగిన మేలు ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, యడ్లపాడు మండల మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రెహ్మాన్ ఖాన్, కోట గ్రామ వైసీపీ అధ్యక్షుడు సయ్యద్ సనాఉల్ల, గ్రామ సీనియర్ నాయకులు హుస్సేన్, గ్రామ సర్పంచ్ యూనుస్, కట్ట జయరావు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు