కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం

పయనించే సూర్యుడు జనవరి 11, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. నాగులవంచ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా గోపి మాట్లాడుతూ శిబిరంలో సుమారు 25 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు నాడు పేదలకు నిత్యవసర సరుకులు అందిస్తున్నామని, ఈ సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అంబటి శాంతయ్య ( ప్రోగ్రెసివ్ రికగ్నైసేడ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్), సామినేని అప్పారావు, ఆలస్యం రవి, రౌతు అప్పారావు, కొండలరావు, అంబటి సైదేశ్వర రావు, వంకాయలపాటి త్రివేణి, వంకాయలపాటి శివ, సామినేని బాబురావు, అంబటి లచ్చయ్య, కోపూరి నవీన్, కాసాని బుచ్చిబాబు, అన్నపోగు తిరుపతిరావు, అంబేద్కర్ నగర యువకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బిజెపి నాయకులు కోరిపల్లి శ్రీను, ప్రధాన కార్యదర్శి మంగయ్య, అనగాని రామారావు, సత్యనారాయణ, పామర్తి శ్రీను, సత్తెనపల్లి గోపి తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *