
పయనించే సూర్యుడు జనవరి 11 ఎన్ రజినీకాంత్:- గౌరవెల్లి రిజర్వాయర్ కుడి కాలువను తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు.. ఈ సందర్భంగా 2010-11 లో నిర్మాణమైన కాలువ హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం, భీమదేవరపల్లి మండలంలోని నర్సంపల్లి నుండి వీర్లగడ్డ తండ వరకు దాదాపు 16.5 కిలోమీటర్ల మేర గల రిజర్వాయర్ కుడి కాలువను ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు ముందుకు సాగుతున్నాయని, దాదాపు కాల్వల ద్వారా 57,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, 1200 ఎకరాల భూమి సేకరణ కోసం 250 కోట్ల అవసరం ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా మాదేనని మరొకసారి గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు