పయనించే సూర్యుడు, జనవరి 11 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార) యువ కెరటం, యువనేత దొడ్ల రామ కృష్ణ గౌడ్ జన్మదిన శుభ సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ కార్యాలయం లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ల తో కలిసి కేక్ కట్ చేసి యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.అలాగే డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లోని జగద్గురు శ్రీ రవిదాస్ మహారాజ్ మందిరంలో సమగర మొచి సంగం సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు జరు పుకోవడం జరిగింది. అనంతరం డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లోని శ్రీ రాజేశ్వరి ఓల్డేజ్ హోంలో కాలనీ వాసు ల ఆధ్వర్యంలో వృద్దులకు అన్నదా న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతిఒక్కరికి పేరుపేరునా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ధన్య వాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కు చెందిన నాయకులు కార్య కర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.