చెరువును కాపాడి రక్షణ గోడ నిర్మించండి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్ పలాస జగన్నాధ సాగరం (పెద్ద చెరువు) లో ఇటీవల జరిగిన కబ్జాలను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తో పాటు కలిసి శనివారం మాజీ మంత్రి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ సిదిరి అప్పలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పలాస నియోజకవర్గం పరిధిలో ఇటీవల వరుసగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయనీ అధికార ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని . గడిచిన 18 నెలల కాలంలో మూడు చెరువులు, ఆరు కొండలు అన్న చందంగా పలాస నియోజకవర్గంలో పరిపాలన కొనసాగుతుందని అన్నారు. పలాస జగన్నాథ సాగరం పలాస పట్టణ ప్రజలకు తాగు నీరు ,పరిసర ప్రాంతం రైతులకు సాగు నీరును అందించడంలో ముఖ్య భూమిక పోషిస్తుందని, ఇటు వంటి చెరువులో పెంటమట్టి వేసి కప్పివేయడం క్షమించరాని నేరమని ఆక్రసించారు. అధికారులు ఎటువంటి రాజకీయ ఒత్తిడలకు తలొగ్గకుండా తక్షణమే చెరువు ప్రాంతాన్ని మార్కింగ్ వేసి ఆక్రమణలను తొలగించి అందరికీ ఉపయోగపడుతున్న చెరువును కాపాడాలని ఆయన కోరారు. ఈ ప్రాంతంలో ఎవరైనా ప్లాట్లు కొన్నట్లయితే పత్రాలు సరిగా చూసుకోవాలనీ , లేనియెడల తాము అధికారంలోకి వచ్చిన తరువాత కచ్చితంగా ఆక్రమణలను తొలగించి ఆ భూభాగాన్ని చెరువులో కలిపేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.