చేగుంట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘనంగా జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ 11 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల గాంధీ చౌరస్తాలో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదిన వేడుకలు దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు సర్పంచ్, సండ్రగు స్రవంతి సతీష్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ చేగుంట మండల కేంద్రంలో హనుమంతరావు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మైనంపల్లి హనుమంతరావు ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం మన చేగుంటలో నీటి సమస్య చాలా ఉండేది మైనంపల్లి హనుమంతరావు చేగుంట మండలంలో ప్రతి గ్రామాలలో బోర్లు వేసి వందల ట్యాంకర్లతో నీటి దాహం తీర్చిన ఘనత మన మైనంపల్లి హనుమంతరావు అని అన్నారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కాశబోయిన మహేష్, చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్టాలిన్ నర్సింలు, అన్నం ఆంజనేయులు చేగుంట ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ, వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు గ్రామాల నుండి వచ్చిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు