జిల్లాలో బీజేపీ ఓబీసీ జిల్లా నూతన పదాధికారుల నియామకం

పయ నించే సూర్యుడు జనవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభుక్త శ్రీనివాస రావు సమక్షం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదాధికారుల నియామాకాల ప్రకటన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగళి గోపి శ్రీనివాస్ సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ జిల్లా పదాధికారుల నియామక ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ నియామక కార్యక్రమాలకు రాష్ట్ర పదాధికారులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు బీసీ కులాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసాయని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మాత్రమే దేశవ్యాప్తంగా ఓబీసీ కులాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కులాలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని, బీసీ కులాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు బీజేపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీ కులాల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడం బీజేపీతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతన ఓబీసీ జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మి రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షాలు ఏపీ బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభుక్త శ్రీనివాస్ రావు, ఓబీసీ మోర్చా జోనల్ ఇంచార్జి ఐనం బాలకృష్ణ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి సత్తుబాబు గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ పదాధికారుల నియామకాలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని, ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అప్పగించిన బాధ్యతలను పార్టీ బలోపేతానికి వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి నల్లా పవన్, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *