తడికమళ్ళ సంజీవరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన రెడ్డెం వీర మోహన్ రెడ్డి, పెరిక నాగేశ్వరావు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 11, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం నారాయణపురం గ్రామం లో తడికమళ్ళ సంజీవరావు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో స్వర్గస్తులైనారు ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి గారు, తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరిక నాగేశ్వరావు (చిన్నబ్బాయి) గారు సంజీవరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, వార్డు మెంబర్లు మరియు బిఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల టౌన్ ఉపాధ్యక్షులు సంఘసాని శ్రీను మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.