తవక్లాపూర్ సర్పంచ్ పొన్నగంటి కృష్ణయ్య ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు జనవరి 11 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) తవక్లపూర్ నుంచి నగారదుబ్బతండ వెళ్లే ప్రధాన రహదారి పక్కన రోడ్డు ప్రక్కన పేరుకుపోయిన కంప చెట్లను మురికి చెత్తను సర్పంచ్ పొన్నగంటి కృష్ణయ్య ఆధ్వర్యంలో పూర్తిగా తొలగించడం జరిగింది అలాగే నగారదుబ్బతండా నుంచి తవక్లపూర్ ప్రధాన రహదారి గుంత గుంతలుగా ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గుంతల మయంగా ఉన్నటువంటి రోడ్డుపై మట్టి కొట్టిస్తున్న సర్పంచ్ కృష్ణయ్య సర్పంచ్ పొన్నగంటి కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రతే ద్వేయంగ పనిచేస్తామని గ్రామంలో తమ విధులు శుభ్రంగా ఉండడంలో తమతో గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన గ్రామస్తులను కోరారు ఎక్కడ ఆ పరిశుభ్రత ఉన్న గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని తమ శక్తి వంచనతో పరిశుభ్రం చేయడానికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని వారు అన్నారు గ్రామంలో వీధులైట్లు పరిశుభ్రత నీటి సౌకర్యం ఎల్లవేళలా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని గ్రామ అభివృద్ధి కోసం అందరికి సహాయ సహకారాలు సూచనలు అందుకుంటామని మాతో కలిసి రావాలని గ్రామ పెద్దలను యువకులను గ్రామ ప్రజలను కోరారు కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ గ్రామ పెద్దలు యువకులు పంచాయితీ సిబ్బంది నారదుబ్బతండ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది