నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు

పయనించే సూర్యుడు 11-1-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్( ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈ రోజు గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎం కృష్ణసాగర్ రెడ్డి మరియు సిబ్బంది ఆధ్వర్యంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై విస్తృత తనిఖీలు నిర్వహించటం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాలిపటాల దుకాణాలు, స్టేషనరీ షాపులు మరియు తాత్కాలిక విక్రయ కేంద్రాలను పరిశీలించటం జరిగింది. ఈ సందర్భంగా చైనా మాంజా వలన మనుషులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు మరియు చిన్నారుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం ఉందని దుకాణదారులకు వివరించడం జరిగింది.అలాగే, ఎవరైనా నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా లేదా రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎం కృష్ణసాగర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గొల్లపల్లి పోలీస్ స్టేషన్. హెచ్చరించడం జరిగింది.