పయనించే సూర్యుడు జనవరి 11 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ భాగంగా దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ద్విచక్ర వాహనదారుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిండి మండల స్థానిక ఎస్సై బాలకృష్ణ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై ర్యాలీ లో పాల్గొనడం జరిగింది. అనంతరం హెల్మెట్ ఉపయోగిస్తే ప్రయోజనం ఎలా ఉంటుందో వివరించారు. బంకులో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని సూచించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బైకు వాహనదారుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని లేకపోతే పెట్రోల్ బంకులొ లభించదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతునెని వెంకటేశ్వరరావు స్థానిక సర్పంచ్ నల్లగంతుల రవి బొల్లె శైలేష్ చెరుకుపల్లి సర్పంచ్ మీసాల రామచంద్రయ్య పోలీస్ సిబ్బంది వివిధ గ్రామ సర్పంచులు వివిధ పార్టీ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.