పాత కక్షల నేపథ్యంలో గొడవ జరగడంతో వైసిపి నేత రాచమంటి చింతరావు అరెస్టు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 యడ్లపాడు మండల ప్రతినిధి. ఎడ్లపాడు గ్రామం మరియు మండల పరిధిలో ఈ నెల 04-01-2026 తేదీన ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో బాధితురాలు గుంజి అంకమ్మ మరియు ఆమె భర్త మధ్య ఇంట్లో వాగ్వాదం జరుగుతున్న సమయంలో రాచమంటి చింతారావు, గోపీ, కోటేశ్, కుమారి మరియు పవన్ అనే వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి, ఆమెను జుట్టు పట్టుకుని కొట్టి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను రక్షించేందుకు వచ్చిన భర్తను . అలాగే ఆమె అత్తమ్మను కూడా కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకుముందు డబ్బు లావాదేవీల విషయంలో బాధిత కుటుంబానికి మరియు రాచమంటి చింతరావు మధ్య వివాదాలు ఉండటంతో, పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగిందని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈరోజు రాచమంటి చింతారావు అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం జరిగింది.