పాలేం వెంకన్న దేవాలయంలో వైభవంగా గోదాదేవి ధనుర్మాస పూజలు

★ భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు మహిళలు .

పయనించే సూర్యుడు జనవరి 11 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలిసిన శ్రీ అల్మేరల్ మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని ప్రత్యేకంగా గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు ,తిరుప్పావై సేవా కాలం, పాశుర పఠనం, మహా మంగళారతి ,ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ శనివారం నాడు తెల్లవారుజామున నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజ చార్యులు తెలిపారు. ఆదివారం నాడు ప్రత్యేకంగా కుడారై ప్రసాద ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రాంత భక్తులు గోదా అమ్మవారి కృపా కటాక్షం పొందుటకు ధనుర్మాస పూజలు నెలరోజుల పాటు చేయుటకు 501 రూపాయి రుసుము చెల్లించి వారికి గోత్రనామాలు తో సంకల్పం చేసి, ప్రతిరోజు పూజలు నిర్వహించి ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు ప్రత్యేకంగా వేద ఆశీర్వచనం ఇస్తున్నట్లు తెలిపారు. స్వామివారి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుటకు ధనుర్మాసం సువర్ణ అవకాశంగా భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జయంత్ కుమార్, శుక్ల, అరవిందు, చక్రపాణి ఆలయ సిబ్బంది ఆర్.శివకుమార్, బాబయ్యఈ ప్రాంత భక్తులు, మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.