
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ 11.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) కళాశాలలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందస్తుగా సంక్రాంతి సంబరాలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేషులు ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి రాజశేఖర్ , డాక్టర్.టి శ్రీనివాస్, కె.అనిల్ కుమార్, డాక్టర్ సి. పవిత్ర అధ్యాపక బృందం, విద్యార్థినీ,విద్యార్థుల తో కలిసి ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. కళాశాలలో రంగవ ళ్ళులు, భోగి మంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రిన్సిపల్ కేక్ కట్ చేసి విద్యార్థినీ, విద్యార్థులకు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియపరచాలని, విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకొని అభివృద్ధి చెందాలని ప్రిన్సిపాల్ సూచించారు.