పయనించేసూర్యుడు. న్యూస్ 11 జనవరి పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్ సంగారెడ్డి జిల్లాపుల్కల్ మండలం లాల్ సింగ్ నాయక్ తాండాలో రామావత్ బిందు (24)భర్త రామావత్ సునీల్ శుక్రవారం ఉదయం 9:30గంటలకు పురిటి నొప్పులతో బాధ పడుతున్న రామావత్ బిందు భర్త సునీల్ 108ఫోన్ చేయగా అప్రమత్తం అయిన పుల్కల్ అంబులెన్సు సిబ్బంది వేగంగా వారి ఇంటికి చేరుకొని పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళను 108వాహనం లోకి తీసుకొని పుల్కల్ ప్రాథమిక ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కావడం తో అక్కడే ఉన్న ఈ .యం.టి అనుదీప్ పైలెట్ నర్సప్ప సహాయం తో మార్గం మధ్యలో నే ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మ నివ్వడం జరిగింది తదుపరి పుల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్షేమంగా తరలించారు తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ.యం.టి అనుదీప్ తెలిపారు సరైన సమయం లో స్పందించిన అంబులెన్సు సిబ్బంది ని పలువురు ప్రశంసిస్తున్నారు.