పయనించే సూర్యుడు జనవరి 11 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) సోమవారం నిర్వహించే ప్రజావాణి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం తోపాటు మండల స్థాయిలో తాహాసిల్దార్ ఎంపీడీవో కార్యాలయంలో కూడా నిర్వహించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజావాణి అంటేనే ప్రజలు నేరుగా అధికారులకు అందుబాటులో ఉండడం ప్రజల సమస్యల్ని అధికారులు విన్నవించడం వాటి పరిష్కారాన్ని సూచించడం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న ఆలోచన తో జిల్లా కేంద్రంతో పాటు స్థానిక మండల తహసిల్ ఎంపీడీవో ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ఈ సోమవారం నుండి ప్రజావాణి పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జనవరి .12 ఈ సోమవారం రోజున కలెక్టర్ స్వయంగా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో హాజరుకానున్నారు ప్రజల దూర బారాల్ని తగ్గించడం ప్రజల సమయాన్ని వృధా చేయకుండా ప్రయాణ బత్యాలని వృధా చేయకుండా ఉండేందుకు ఒక వినూత్నమైన ఆలోచన చేయడం జరిగిందని దాన్ని ప్రతిష్టపరిచేందుకు ప్రతి వారం కలెక్టర్ కూడా ఒక్కొక్క మండల కేంద్రంలో పాల్గొంటారని సోమవారం నుంచి ఆయా మండల కేంద్రాల్లోని ప్రజలందరూ తహసిల్ ఎంపీడీవో కార్యాలయలలో సమస్యల ఫిర్యాదులను అధికారులకు తెలుపవచ్చన్నారు అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు