ప్రపంచానికి జ్ఞానానందించేది హిందుత్వం ఒక్కటే హిందూ సమ్మేళనం

పయనించే సూర్యుడు జనవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీ ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామం ముమ్మిడివరం ఖండలో చివరిదైన తొమ్మిదవ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పూజ్యశ్రీ పొడుగు వేంకట సత్యనారాయణ ప్రసాదాచార్య స్వామీజీ వారు పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించగలిగిన ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే అటువంటి ధర్మం ప్రజ్వలిస్తు ఉన్నంతకాలమే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. మతాల పేరుతో ఎన్నో దేశాలు కొట్టుకుంటున్నాయి మన దేశం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది. ఈ అఖండ భారతాన్ని కొంతమంది దుర్మార్గులు ముక్కలు చేసి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నాశనం చేయాలని ఇక్కడ అమాయక హిందువులను మతం మారుస్తున్నారు. అటువంటి దుర్మార్గులను ప్రాలద్రోలి మన సంస్కృతి సంప్రదాయాలను రక్షించుకుంటూ మన దేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలుపుటకు అందరూ ముందుండాలన్నారు. ముఖ్యవక్త బులుసు జగదీష్ మాట్లాడుతూ పంచ పరివర్తనలు వివరిస్తూ ఋషులు యోగులు మనకు ఎంతో శక్తిని విజ్ఞానాన్ని అందించారు మనం జూలో సింహాలుగా కాకుండా అడవిలో గర్జించే సింహంలా మనం ఉండాలి మన పిల్లలను ధైర్యవంతులుగా దేశభక్తి ధర్మ రక్షణ నేర్పుతూ పెంచాలన్నారు. యనమదల లక్ష్మి మాట్లాడుతూ మహిళలు మన పిల్లలకు రామాయణం భగవద్గీత మరియు మహా పురుషుల యొక్క గొప్పతనాలను వారికి తెలియజేసినప్పుడు మంచి పౌరులుగా వారు తయారవుతారు అన్నారు. ముఖ్యఅతిథి గుద్దటి జమ్మి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం ఆర్ఎస్ఎస్ దేశంలో ఏ విపత్తు సంభవించినా ముందుగా సేవలందించి ఆదుకునేది ఆర్ఎస్ఎస్ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్మెత్స గోపాలకృష్ణంరాజు గొలకోటి వెంకటరెడ్డి గుద్దటి సూర్యనారాయణమూర్తి నిమ్మన చిన్నారావు సుంకర శేషవేణి గుత్తుల లక్ష్మీ దుర్గ గుద్దటి రమణమ్మ మామిడి రమేష్ పితాని రామచంద్రరావు పొత్తూరి సత్యనారాయణరాజు ఏలూరి రాంబాబు గిరిగి కోదండపాణి గుద్దటి పల్లంరాజు సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మరియు హిందూ బంధువులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *