పయనించే సూర్యుడు జనవరి 11 (మేడ్చల్ నియోజకవర్గం మాధవరెడ్డి ప్రతినిధి) గ్రేటర్ హైదరాబాద్ పోచారం డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో ఉన్న శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో బాలాజీ నగర్ హనుమాన్ ఆలయ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బుల్ల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు బాలాజీ నగర్‌లోని పార్కు కొంతమంది బడా నాయకుల చేత కబ్జాకు గురయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏనుగు సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రం అందజేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోసం కేటాయించిన పార్కులు, ఓపెన్ ప్లేస్‌లను కబ్జా చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని మండిపడ్డారు. గతంలో ఏకశీల కాలనీలో ప్రజలతో కలిసి రోడ్డెక్కి ధర్నా చేసి న్యాయం సాధించినట్టే, బాలాజీ నగర్ పార్కు విషయంలో కూడా అవసరమైతే ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాలనీ వాసుల ఐక్యతే అసలు బలం అని పేర్కొన్న ఆయన ప్రజా స్థలాలను కబ్జా చేసే ఎవరైనా సరే ఎంత పెద్ద నాయకుడైనా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత తాను తీసుకుంటానని ఘాటుగా హెచ్చరించారు.బాలాజీ నగర్ ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని, పార్కు స్థలాన్ని కాపాడే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడంతో కార్యక్రమం రాజకీయంగా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.ఈ కార్యక్రమంలో కొర్రముల బిజెపి సీనియర్ నాయకుడు మహేష్ గౌడ్, మెడగొని ధనుష్ నాయుడు సత్యనారాయణ మరియు బాలాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షుడు ఆరోజు శ్రీనివాస్ చారి జనరల్ సెక్రటరీ సిద్ధార్థ గొల్లపల్లి జాయింట్ సెక్రెటరీ గడ్డం మారుతి పండ్యాల దేవేందర్ రెడ్డి దారావత్ శ్రీనివాస్ పడకండి లింగాచారి జానకి శరత్ కుమార్ మధుసూదన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కాలనీవాసులు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.