బిజినపల్లి మాజీ ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 11 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బీజినపల్లి మండల మాజీ ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు బీజినపల్లి మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ బీజినపల్లి మండల మైనార్టీ నాయకులు ఎండి గఫూర్ పాల్గొని, శ్రీనివాస్ గౌడ్ సేవలను ప్రశంసిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీజినపల్లి మండల సోషల్ మీడియా వారియర్స్ గట్టు, వంశీ నాయక్, వెంకటేష్, మహమ్మద్ రుక్మద్దీన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ప్రజాసేవలో పుప్పాల శ్రీనివాస్ గౌడ్ పాత్ర మరింత కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో ఆనందంగా జరుపుకున్నారు.