బైపాస్ సర్జరీ చేయించుకున్న భాషను పరామర్శించిన

★ టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ

పయనించే సూర్యుడు జనవరి 11 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఆదోని పట్టణంలో హనవాళ్లు గ్రామం నకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు హనవాలు మా భాషకు ఆరోగ్యం ఇటీవల బైపాస్ సర్జరీ చేసుకొని ఇంటికి వచ్చిన సందర్భంగా, ఆయనను పరామర్శించేందుకు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ప్రత్యేకంగా మాభాష ని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ధైర్యం గా ఉండాలి అని “పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుంది. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాసేవలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధారెడ్డి ఎక్స్ ఎంపీపీ మురళి మల్లికార్జున, ఎక్స్ కౌన్సిలర్ మారుతి, బాబురావు సాదిక్ వలి భాస్కర్ చంద్ర, దేవేంద్ర, రాజశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.