
పయనించేసూర్యుడు. న్యూస్ 11 జనవరి పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గంలో సాగునీటి పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో సింగూర్ కాల్వల మరమ్మత్తులు, లైనింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఖరిఫ్ కు రైతులకు సాగునీరు అందించాలని మంత్రి అధికారులను అదేశించారు. పెద్దారెడ్డి పేట లిప్ట్ ఇరిగేషన్ పనులపై ఈ సమావేశంలో చర్చించారు. నియోజక వర్గంలో 40 ఏకరాలకు సాగునీరు అందించేలా చేపట్టనున్న పెద్దారెడ్డి పేట లిప్ట్ ఇరిగేషన్ పనుల అంచనాలను వెంటనే రూపోందించి ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి అధికారులను అదేశించారు. సింగూర్ ప్రాజేక్టు మరమ్మత్తుల పనులపై మంత్రి చర్చించారు. మరమ్మత్తు పనులను చేపట్టుతున్న సందర్భంగా సింగూర్ ప్రాజేక్టు లో నీటిని వృదా కాకుండా విద్యుత్ ఉత్పత్తి తో పాటు దిగువన ఉన్న ఘన్ పూర్ ఆయకట్టు తో పాటు నిజాం సాగర్ ప్రాజేక్టు ఆయకట్టు కు నీటిని తరలించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను అదేశించారు. ఈ సమీక్ష లో ఈయన్.సి శ్రీనివాస్ , యస్.ఈ. రఘునాథ్,ఈఈ భీమ్. పాల్గోన్నారు.
