యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంక్రాంతి మెగా క్రికెట్ పోటీలు

★ ముఖ్య అతిథులుగా ముల్కనూర్, వంగర ఎస్సైలు రాజు, దివ్య..

పయనించే సూర్యుడు జనవరి 11 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కుల అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో మండల స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముల్కనూర్ హై స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముల్కనూర్ ఎస్సై రాజు, వంగర ఎస్సై ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, వంగర సర్పంచ్ గజ్జల సృజన రమేష్, కొత్తకొండ టెంపుల్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా హాజరైనారు. ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ వార్డు మెంబర్ ముత్యం అశోక్ యాదవ్, మాడుగుల గోపి,ఉప సర్పంచ్ కాసగోని మమతా బాలకృష్ణ, క్రీడాకారులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్లో క్రీడాకారులు, అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టోర్నమెంట్ విజేతలకు పెద్ది వసంత మెమోరియల్ ట్రస్ట్ వారు, ముత్యం అశోక్ యాదవ్, కొత్త కొండ ఆలయ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా, ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, గద్వాల ప్రశాంత్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారికి యూత్ కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు..