పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 11 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం, రాజనగర్ గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద చీరల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భారతపు రాజేష్ పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. వార్డు సభ్యులు భారతపు రాజు, కాటిపెల్లి సతీష్ రెడ్డి, చల్ల మాధవి, కొమ్ముల వజ్ర, సిఏ హసీనా, మహిళా సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని నాయకులు తెలిపారు.