రాహూల్ ప్రధాని కావడమే ఎస్సీల లక్ష్యం కావాలి

పయనించే సూర్యుడు న్యూస్:జనవరి/11:నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం. మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కొవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించుకోవడమే లక్ష్యంగా దళితులు ఇప్పటి నుంచి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎస్సీ సెల్ చైర్మన్ గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా జిల్లా కేంద్రానికి శనివారం విచ్చేసిన సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అధ్యక్షతన జరిగిన స్వాగత సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 140 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న దళితులు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. దళితుల సంక్షేమ కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఉన్నత పదవులిచ్చి గౌరవించిందన్నారు.అదే బీఆర్ఎస్ పాలనలో దళితులకు ఎదురైన అవమానాలను ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించిన ఈ పదవిని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల సమస్యల పరిష్కారంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కవ్వంపల్లి సత్యనారాయణ పగ్గాలు చేపట్టి పార్టీకీ జవసత్వాలు కల్పించారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడం వెలుక కవంపల్లి కృషి ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగానే కవ్వంపల్లి సత్యనారాయణకు ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ పెదవి లభించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ చైర్మన్ పదవికి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే పరిపూర్ణ నమ్మకం తనకుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు న్యాయం జరుగుతున్నదన్నారు. గతంలో క్యాబినెట్ లో ఒక్క ఎస్సీ కూడా చోటు దక్కకపోగా, ఇప్పుడు నలుగురు ఎస్సీలకు మంత్రిపదవులు ఇచ్చారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీలంతా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరితో కలిసి పని చేయడం, అందరివాడనిపించుకోవడం కవ్వంపల్లి సత్యనారాయణ సక్సెస్ మంత్రమన్నారు. సౌమ్యుడిగా కనిపించినప్పటికీ అవమానాలను సహించబోరని, ఎంతకైనా ఆయన తెగిస్తారన్నారు. శాంతమెంతో కోపమంతేనన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు కవ్వంపల్లి సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బలపడిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనూరాధ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజేశేఖర్, పార్టీ నాయకులు ఊట్కూరి నరేందర్ రెడ్డి, అరుణ్ కుమార్, తాజ్, మంజుల, రజిత తదితరులు పాల్గొన్నారు. మానేరు వంతెన వద్ద. ఎస్సీ సెల్ చైర్మన్‌గా నియామకమైన అనంతరం తొలిసారిగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి శనివారం విచ్చేసిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు మానేరు వంతెన వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తోపాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పారు. ఇదిలా ఉండగా పార్టీ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు. తెలంగాణా చౌక్ వద్ద.. తెలంగాణ చౌక్ వద్ద కవ్వంపల్లి సత్యనారాయణ అపూర్వ స్వాగతం లభించింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,చెప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయనకు కాలువాలతో సత్కరించారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం కవ్వం పల్లి సత్యనారాయణ పార్టీ నాయకుల తో కలిసి ఇందిరా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.