పయనించే సూర్యుడు జనవరి 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలంలోని రేపల్లెవాడ గ్రామంలో శనివారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఖమ్మం విజిలెన్స్ ఏడీ రామకృష్ణ నేతృత్వంలో విద్యుత్ శాఖాధికారులతో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డిష్ కేబుల్స్ నిర్వహణను అధికారులు గుర్తించారు. ప్రధానంగా విద్యుత్ స్తంభాలను అనధికారికంగా వాడుకోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అస్తవ్యస్తంగా వైర్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏడీ రామకృష్ణ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన బాధ్యులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు కరెంటు విజిలెన్స్ అధికారులు వచ్చి గ్రామంలో ఉన్నటువంటి స్తంభాలపై ఉన్న అక్రమ కలెక్షన్లను నాలుగు యంపీ ప్లేయర్లను గుర్తించి తొలగించడం జరిగింది అక్రమంగా కలెక్షన్ ఇచ్చినటువంటి డిస్ కలెక్షన్ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు సమాచారం తెలియ చెప్పలేదు ఇట్టి సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో జిల్లా అధికారికి నివేదిక ఇచ్చిన తరువాత ఏన్కూరు మండలం విద్యుత్ శాఖ అధికారికి తెలియజేసి ఇంతకుముందు ఏమైనా ఇటువంటి సమస్యను గుర్తించారా లేదా అనే విషయం తెలుసుకున్న తర్వాత మండల విద్యుత్ శాఖ అధికారి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వచ్చినటువంటి విజిలెన్స్ అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది రేపల్లెవాడ గ్రామానికి సంబంధించిన విద్యుత్ శాఖ లైన్మెన్ డిష్ కలెక్షన్ సంబంధించిన యాజమాన్యం వద్ద ముడుపులు తీసుకుంటున్నారు అనే సమాచారం గ్రామస్తుల నుండి వినపడుతుంది ఎవరైనా గ్రామస్తులు పై అధికారులకు సమాచారం ఇస్తే నీటి మీద బుడగల పట్టించుకునే నాధుడే కరువయ్యారు మరి డిష్ కలెక్షన్ యాజమాన్యం మీద అంత ప్రేమ ఏంటో అర్థం కాని పరిస్థితిలో గ్రామస్తులు లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా దందా నడుపుతున్న పట్టించుకోని మండల విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్తులు డిష్ యజమానిపై ఫిర్యాదు చేశారు తుతు మంత్రంగా విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఆ యజమానిని వెంటవేసుకొని తిరిగిన విజిలెన్స్ అధికారులు మండలంలో పలు గ్రామాల్లో. ముడుపులు తీసుకొని కలెక్షన్లు ఇస్తున్నారు అనే ఆరోపణలు మండల వ్యాప్తంగా వినపడుతుంది మరి వీరిపైన జిల్లా అధికారులైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మరి