రోడ్డు భద్రతపై అవగాహన వాహనదారులు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి

★ ఎస్సై దివ్య

పయనించే సూర్యుడు జనవరి 11 ఎన్ రజినీకాంత్:- జాతీయ రోడ్డు భద్రత మాసంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ఎస్సై దివ్య ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గాంధీనగర్, హుజురాబాద్ రోడ్డు మార్గంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు గులాబీ పువ్వుతో ఎస్సై దివ్య సత్కరించారు.. అనంతరం వాహనదారులకు వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు తెలియజేశారు..