లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగేశ్వరావు పుట్టినరోజు వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): పట్టణంలోని సాయి శంకర్ నేత్రాలయం ప్రముఖ వైద్యులు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అనసూయ నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు తల్లిదండ్రులు రాజారావు, సుబ్బులక్ష్మి మాట్లాడుతూ తన కుమారుడు నాగేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గొల్లపూడి గణేష్, తండూరి రాము,బాబ్జి లు పాల్గొన్నారు.