వరంగల్ లో జరిగే ‘ఓసి సింహగర్జన విజయవంతం చేయాలి

★ జిల్లా అధ్యక్షులు ఏనుగు నర్సిరెడ్డి పిలుపు

పయనించే సూర్యుడు, జనవరి 11, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. ​అగ్రవర్ణాల హక్కుల సాధన కోసం,వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఓసి సింహగర్జన’ భారీ బహిరంగ వేలాదిగా తరలి రావాలని జనగామ జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు ఏనుగు నర్సిరెడ్డి పిలుపు నిచ్చారు.ఓసి జె.ఏ.సి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జనవరి 11 ఆదివారం హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.​శనివారం బచ్చన్నపేటలో రెడ్డి సంఘం కమిటీ హాల్లో బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏనుగు నర్సిరెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులు, నిరుద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని,వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ​సభ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచబోతున్న జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఓ.సి. కమిషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని ​ఈ డబ్ల్యూ ఎస్ గడువు సర్టిఫికెట్ జారీ ప్రక్రియను సరళతరం చేస్తూ,దాని కాలపరిమితిని 5 ఏళ్లకు పెంచాలన్నారు. ఉద్యోగ పోటీ పరీక్షల్లో ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని పెండింగ్‌లో ఉన్న ఈ డబ్ల్యూ ఎస్ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ​ఆదాయ పరిమితిని రూ. 8 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచాలన్నారు. ​టెట్ పరీక్షలో అర్హత మార్కులను 90 నుండి 70కి తగ్గించాలని. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ఓ.సి.వర్గాలకు కూడా వర్తింపజేయాలని ​‘చలో వరంగల్’ కు తరలిరావాలన్నారు ​ఈ సింహగర్జన సభకు సమస్త ఓ.సి. సామాజిక వర్గాల ప్రజలు, మేధావులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ‘చలో వరంగల్’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏనుగు నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి బోడిగెం వెంకటరెడ్డి, ట్రెజరర్ వేమల్ల నర్సిరెడ్డి, నర్ర యకం రెడ్డి, రెడ్డి సంఘం జిల్లాయూత్ అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, వైశ్య సంఘం నాయకులు కొత్తపల్లి రాజయ్య, పులిగిళ్ల కనుకయ్య, చిమ్ముల సుధాకర్ రెడ్డి, దొంతుల రాజు, నర్ర కర్ణాకర్ రెడ్డి, పడిగెల కర్ణాకర్, వడ్డేపల్లి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.