విద్యుత్ సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజాబాట

★ డివిజినల్ అసిస్టెంట్ ఇంజనీర్ నగేష్ కుమార్.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 బోధన్ :విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విద్యుత్ శాఖ డివిజనల్ అసిస్టెంట్ ఇంజనీర్ నగేష్ కుమార్ అన్నారు. బోధన్ టౌన్ 2 సెక్షన్ వారి ఆధ్వర్యంలో శనివారం కొప్పర్తి, ఫత్తేపూర్ గ్రామాలలో శనివారం వినియోగదారులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రత సూత్రాల కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజలు, రైతులు విద్యుత్ సమస్యలు తెలుసుకుని కొన్నింటిని సత్వరం పరిష్కరించి తెలవని వాటికి అవసరమైన సామాగ్రి కొరకు అంచనాలు, ఎస్టిమేషన్లు తయారు చేసి త్వరలో పరిష్కరించి విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు గాలిపటాలు విద్యుత్ లైన్ దగ్గరగా ట్రాన్స్ఫార్మర్ ల దగ్గరగా ఎగరవేయకుండా కాళీ ప్రదేశాలలో ఎగరవేసే విధంగా చూడాలన్నారు. గాలిపటాల యొక్క దారాలు విద్యుత్ లైన్ లకు చుట్టుకుంటే తీసే ప్రయత్నాలు చేయకూడదన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రజా బాట కార్యక్రమం వారంలో 3 రోజులు మంగళ, గురు, శనివారం గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.ప్రజలు,రైతులు విద్యుత్ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ విద్యుత్ వినియోగదారులు,రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు విద్యుత్ పొదుపు గురించి కెపాసిటర్లు అమర్చడం వలన కలిగే లాభాలను తెలియపరుస్తున్నారు. ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేసిన వెంబడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ 2 ఏఈ కళ్యాణ్,సబ్ ఇంజనీర్ ఓం ప్రకాష్, లైన్ ఇన్స్పెక్టర్ గంగా కిషన్, అసిస్టెంట్ లైన్మెన్ శాంతి ప్రకాష్, భరత్, విద్యుత్ వినియోగదారులు, రైతులు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.