శ్రీమహాశక్తి ఆలయంలో బీజేపీ శ్రేణుల పూజలు

పయనించే సూర్యుడు జనవరి 11 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ పట్టణంలోని దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి ఆలయంలో బిజెపి శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్బంగా బిజెపి నేతలు మాట్లాడుతూభారత దేశ సాంస్కృతిక చిహ్నం సోమనాథ్ మందిరంపై 1000ఏళ్ల క్రితం జరిగిన అనాగరిక దండయాత్ర విచారక ఘటన ను గుర్తు చేసుకుంటూ దేశమంతా శివాలయాల్లో అభిషేకాలు చేయాలని బీజేపీ జాతీయ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు శ్రీ మహాశక్తి దేవాలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపారు జనవరి 1026 లో సోమనాథ్ ఆలయం తన చరిత్రలో మొట్టమొదటి దాడిని ఎదుర్కొందన్నారు ఆ తరువాత జరిగిన అనేక దాడులు కూడా మన శాశ్వతమైన విశ్వాసాన్ని సడలించలేకపోయాయని పైగా ఈ దాడులు భారతదేశ సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేశాయన్నారు ఆలయ పునర్నిర్మాణ పనులు జరిగి 75 ఏళ్లు కావస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ ఆలయ అభివృద్ధి కోసం కంకణబద్దులై ఉండటం పట్లా దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి తాజా మాజీ కార్పొరేటర్ బండ సుమరమణారెడ్డి బిజెపి నేతలు ప్రసన్నా రెడ్డి సిద్ది సంపత్ మహిళా భక్తులుతదితరులు పాల్గొన్నారు