108 లోనే ప్రసవం

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 11,2026, వాంకిడి, వెల్గి, కొమరం భీమ్, ఝాడే భక్త రాజ్, ప్రతినిధి. వాంకిడి మండల కేంద్రంలోని, కోపగూడకు చెందిన మడావి మారుబాయి కి పురిటి నొప్పులు రావడం తో 108 కి సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకొని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యమంలోనే అడశిశువుకి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో వారిని వాంకిడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించినట్లు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ దేనవేణి సంతోష్, ఫైలెట్ భీంరావు తెలిపారు.