పయనించే సూర్యుడు 12-1-2026 గొల్లపల్లి మండల ప్రతినిధి (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవ కార్యకర్త గంగాధర మధుసూదన్, ఆధ్వర్యంలో గౌరవ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామ స్మరణ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు ముఖ్య అతిధిగా గాయత్రి మాత విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పోలూకాల రాజా గణేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పోలుకల రాజ గణేష్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం చేస్తూ అంబేద్కర్ స్మరించుకోవడం చాలా గొప్ప విషయమని ఇందులో మేమందరం కూడా పాల్గొ నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అంబేద్కర్ కృషి లేకపోతే మన బహుజనులు అందరం ఎక్కడ ఉండే వారం తెలుసుకోవాలి అన్నారు.అంబేద్కర్ అంటే అందరికీ ధైర్యం ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గాయత్రి మాత విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు బలభక్తుల కిషన్,శ్రీకోటి భూమయ్య,భాస్కరా చారి, మండలోజీ శ్రీనివాస్,నిరంజన్, వెంకటస్వామి చారి మల్లేశం, రాజన్న,గోపి,సంఘ సభ్యులు గ్రామస్తులునక్క విజయ్,వేల్పుల రాజేష్, సామజిక సేవ కార్యకర్త గంగాధర మధుసూదన్, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.