ఆర్థిక సహాయం చేసిన జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప.

పయనించే సూర్యుడు జనవరి 12 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. జీవ సల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు రాము తండ్రి నిన్నటి రోజున పరమపదించడం అత్యంత విషాదకరమని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్పన్న తెలిపారు. ఈ దుర్ఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, రాము కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా అంత్యక్రియల కార్యక్రమ నిర్వహణ నిమిత్తం జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్పన్న రూ.10,000/- (పదివేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని రాము కుటుంబానికి అందజేశారు. ఈ కష్టసమయంలో జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.మరణించిన ఆత్మకు శాంతి చేకూరాలని, శోకసంతప్తులైన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ సంతాపాన్ని తెలియజేశారు.