పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సంటనరీ కాలనీ-12 రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో నాలుగు సి సి కెమెరాలను నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి ఆదివారం రోజున పునరుద్దీకరణ పనులను ప్రారంభించారు.నాలుగు సంవత్సరాలుగా నిద్రావస్థలో ఉన్న సి సి కెమెరాలను అధికారులు పట్టించుకోలేదు.నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చొరవ తీసుకొని సి సి కెమెరాల పనులను ప్రారంభించారు గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి ని కల్వచర్ల గ్రామ ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో 2వ వార్డు సభ్యురాలు మల్యాల పద్మ, బూస కనకయ్య, బూస అజయ్,బూడిద సంపత్, కోలిపాక చంద్రయ్య,ప్రజలు పాల్గొన్నారు.