ఘనంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవం

పయనించే సూర్యుడు 12-1-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు పోరాటయోధుడు వడ్డే ఓబన్న219 వ జయంతి సందర్భంగా మహనీయునికి జయంతి వేడుల చేయడం జరిగింది. ఆదివారం రోజున గొల్లపల్లి లో వడ్డె ఓబన్న సేవ సంగం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఓరుస్సు రాజ్ కుమార్. ఉపాధ్యక్షులు దండ్ల రమేష్. ప్రధాన కార్యదర్శి ఈడగోటి స్వామి. క్యాషియర్ దండ్ల శ్రీను. మరియు సంఘ సభ్యులు అదేవిధంగా గొల్లపల్లి గ్రామ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి ఉప సర్పంచ్ గురజాల బుచ్చిరెడ్డి మరియు వార్డు సభ్యులు బీజేపీ నాయకులు కట్ట మహేష్. పాల్గొన్నారు. తదుపరి నూతనగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లకు శాలువాలతో సన్మానం చేయడం జరిగింది.