పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 12 ప్రతినిధి : వెంకటేష్ కొన్ని పాటి కడప రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న జ్ఞాన్ విహార్ స్కూల్, కడపలో జ్ఞాన్ విహార్ ఎరుడిషన్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రతిభను ప్రోత్సహించడం, ప్రతిభకు గౌరవం ఇవ్వడం, జ్ఞాన్ విహార్ స్కూల్లో మీ భవిష్యత్తును తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పరీక్షకు సుమారు 200 పై చిలుకు విద్యార్థులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. వసంత పంచమి మహోత్సవం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని, జనవరి 23న ఫలితాలు ప్రకటించబడతాయి. విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతితో పాటు పాఠశాల తరుపున స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించబడుతుంది. పాఠశాల వ్యవహారాలను సమర్థవంతంగా నడిపిస్తున్న చైర్మన్ పి. సుధాకర్ గారు, కరస్పాండెంట్ డా. కె. రవి శంకర్ & ప్రిన్సిపల్ శ్రీమతి కె. సువర్ణ గారి సమర్థ మార్గదర్శకత్వంలో, యాజమాన్య బృందం, ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది అందరూ సంపూర్ణ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుత విజయంగా నిలిపారు.