యాదగిరి భౌతిక దేహాన్ని సందర్శించినపరామర్శించిన పల్లా సుందర్ రాంరెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 12 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) దేవరుప్పుల మండలం, నీర్మాల గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వడ్లకొండ యాదగిరి కొద్దిరోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా ఆదివారం వారి ఇంటికి వెళ్ళి వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పల్ల సుందర్ రామ్ రెడ్డి వారి వెంట గ్రామ సర్పంచ్ పల్లెర్ల సంధ్యారాణి నవీన్, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, పార్టి సీనియర్ నాయకులు కొత్త జలెందర్ రెడ్డి, కుతాటి నరసిహులు, ఇంటి మల్లారెడ్డి, ఐలయ్య, మైసయ్య, రాములు, సత్యనారాయణ, రవి వార్డు మెంబర్లు నరసింహ, శ్రీను, ఊగేందర్, తదితరులు పాల్గొన్నారు.