పయనించే సూర్యుడు జనవరి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు నిర్వాహకులు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌లో మొదటి బహుమతిగా రూ.30,000, రెండో బహుమతిగా రూ.20,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమ ప్రారంభ సందర్భంగా క్రీడాకారులను ఉత్సాహపరిచిన అతిథులు క్రీడల ద్వారా శారీరక, మానసిక అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, శివయ్య యాదవ్, సంతోష్ రెడ్డి, శేఖర్ గౌడ్, వంశీధర్ రెడ్డి, వెంకటయ్య, జియాజి, రాజేందర్ గౌడ్, శేఖర్ శెట్టి, ఉపేందర్ రెడ్డి, మీ సేవ కృష్ణ తదితరులు పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.