సత్తుపల్లి మున్సిపల్ ఎలక్షన్ లో కాషాయ జండా ఎగరవేస్తాంగుత్తా వెంకటేశ్వరరావు

పయనించే సూర్యుడు: జనవరి 12 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు బీజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బాణావత్ విజయ్ అధ్యక్షతన సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గుత్తా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి వందలాది సర్పంచులను, అత్యధిసంఖ్యలో వార్డు మెంబర్లను కైవసం చేసుకుందన్నారు. అదేవిధంగా రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో మున్సిపాలిటీలను గెలవబోతుందన్నారు. సత్తుపల్లి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా కాషాయ జెండా ఎగరటం ఖాయమని, ప్రజలు బిజెపికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి బిజెపి శ్రేణులు ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సత్తుపల్లి మున్సిపాలిటీ సమస్యలపై నిరంతరంగా బిజెపి పోరాటం చేసిందని, సింగరేణి బాంబు పేలుళ్ల ప్రభావంతో ఇళ్ళు దెబ్బతిన్న బాధితుల తరఫున అలుపెరగని పోరాటం చేయడం జరిగిందని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ హాస్పటల్ ప్రారంభించమని ధర్నా చేస్తే అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో బిజెపి నాయకులు పై అక్రమ కేసులు బనాయించడం జరిగిందని, అదేవిధంగా పారిశుద్ధ్యం గురించి, తాగునీటి సమస్య గురించి నిరంతరం బిజెపి అనేక ఉద్యమాలు చేయటం జరిగిందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ, ప్రభుత్వం సత్తుపల్లి మున్సిపాలిటీకి వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, కేవలం కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు నడుస్తున్నాయన్నారు. కాబట్టి సత్తుపల్లి మున్సిపాలిటీ ఓటర్లు బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నంబూరి రామలింగేశ్వర , ఇవి రమేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా, భాస్కర్ణి వీరంరాజు, జిల్లా కార్యదర్శి సురేందర్ రెడ్డి ,జిల్లా కౌన్సిల్ మెంబర్ పర్సా రాంబాబు, జిల్లా నాయకులు పడగల మధుసూదన్ రావు, సీనియర్ నాయకులు షేక్ రహమతుల్లా, మన్నెం నరసింహా మూర్తి, మాజీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మంద శివ, కార్తీక్ , చీకటి వసంతరావు, సాయి, సందీప్ ,మెరుగు శేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు.