పయనించే సూర్యుడు జనవరి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచులను ఎస్సై శ్రీనివాసులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి లట్టుపల్లి సర్పంచ్ మారేపల్లి శివలీల చంద్ర గౌడ్, మునీందర్ నాయక్, పాండు నాయక్, ఎం. కృష్ణ నాయక్, మండల నాయకుడు మూడవత్ గోవింద్ నాయక్, మాజీ ఎంపీటీసీ గడ్డం రామచంద్రయ్య, గుమ్మకొండ నాగయ్య, ఇగురంబాద శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కార్యదర్శి వాలియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.