పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 12 పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలో ని మానవత్వం మంటగలిపే ఈ రోజుల్లో విధి నిర్వహణలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెను వెంటనే చిల్లకల్లు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్సై సూర్య శ్రీనివాస్ , ఎస్ఐ2 సాయి మణికంఠ హుటాహుటిన ప్రమాద ఘటన చోటుచేసుకున్న ప్రాంతము చేరి సహకారం అందించారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామం శివారు చెరువు వద్ద జరిగిన సంఘటన స్థలానికి వెళ్లి నీటిలో పడిపోయినటువంటి కుటుంబ సభ్యులను బయటకు తీసి ఓ వ్యక్తి ప్రాణాపాయంగా ఉండటం , వ్యక్తి ఇబ్బంది పడటం చేత ఇద్దరు ఆ వ్యక్తులకు సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడి మెరుగైన వైద్యం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమీప ప్రజలందరూ కూడా నిజంగా ఖాకీ అంటే కర్కశం కాదని అవసరమైతే అభిమానం, సహాయం సహకరించడం అని రుజువు చేశారు ఎస్సై లు. ఖాకీ లో కూడా అంటే కల్మషం లేని కొందరు అధికారులు ఉంటారనేది ఇప్పుడు ఆ ఎస్సైలు సూర్య శ్రీనివాస్ ,ఎస్ఐ సాయి మణికంఠ లను చూసి తెలుసుకున్నామని ప్రజలు అభినందించారు. వీరి తోపాటు హోంగార్డు అప్పారావు, మరి కొద్దిమంది పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు ఎస్సై సూర్య శ్రీనివాస్ ,ఎస్ఐ సాయమణికంఠ లకు సహకరించారు.