అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 బోధన్ పట్టణంలోని గత నెల 21 తేదీన రాత్రి సుమారు 02.00 గంటల సమయంలో, గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు మొదట ఆచన్ పల్లి ఏరియాలో ఒక మోటార్ సైకిల్ ను దొంగలించుకొని, పట్టణంలోని ప్రబుత్వ ఆసుపత్రి ముందర గల రెండు బంగారూ షాప్ ల యొక్క షటర్ తాళాలు పగులగొట్టి షాప్ లో నుండి 35 తులాల బంగరము 14 కిలోల వెండి నగలను దోచుకొని తమ ప్రాంతమైన మహారాష్ట్రలోని ఉమ్రి కి పారిపోయారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని గాలించి ఆచన్ పల్లి బైపాస్ రోడ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను లక్ష్మన్ సింగ్, ప్రేమ్ సింగ్, సాగర్ సింగ్, మహమ్మద్ షేక్, లను, అదుపులోకి తీసుకొని విచారించగా పట్టణంలో చేసిన నేరాలను వారు అంగీకరించారు. వారి వద్ద ఇటీవల చోరీ జరిగిన బంగారు దుకాణాల వ్యవహారంలో దొంగలించిన సొత్తులో 14 తులాల బంగారము 6 కిలోల వెండి నగలతో పాటు రెండు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నాటు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ వెంకట నారాయణ, ఎస్సై మనోజ్ కుమార్, ఎఎస్సై బాబురావు సిబ్బంది రవి, మహేష్, సాయి కుమార్, అశోక్ లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, మరియు బోధన్ ఎసిపి శ్రీనివాస్ అబినందించినారు.